That's why పవన్ వెర్రి పవన్ వెర్రి పవన్ వెర్రి డి!!!

That's why పవన్ వెర్రి పవన్ వెర్రి పవన్ వెర్రి డి!!!

2 Sep 19 @ 5:43 PM | By GitacharYa

Now starts the magic!

Long long ago, Twenty Three years ago...

చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అతి త్వరలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలినేర్పరచుకుని, లాయల్ ఫ్యాన్స్‌తో దూసుకుని పోయాడు. వన్ సైడ్ లవర్ గా 'సుస్వాగతం' సినిమాలో తను చూపిన నటన ఒక పట్టాన వదలదు. అయ్యో, తండ్రి చనిపోయాడే? అన్న బాధా, కోరుకున్న అమ్మాయి కరుణించదే అని ఆ పిల్ల మీద మనకు కోపం లాంటి భావోద్వేహాలను కలిగేలా చేసినా, ఫ్రెండ్స్ తో కలసి చేసిన అల్లరి పనులు మనం కూడా అలా చేస్తే బావుణ్ణు అనుకునేలా చేసినా అది పవన్ కే స్వంతం.

ముఖ్యంగా రఘువరన్ తో వచ్చే సన్నివేశాలలో చెప్పనలవి కాని రీతిలో ఉంటుంది ఆ నటనా పాటవం. హాస్య సన్నివేశాలలో సుధాకర్ డామినేషన్ కనిపించినా, తను కూడా తక్కువ తినలేదు. సినిమా కూడా మంచి హిట్టే. పవన్ మార్కు కాస్తంత కనిపిస్తుంది కూడా...

తరువాత వచ్చింది 'తొలి ప్రేమ'. ఒకటా రెండా? ఎత్తుకున్న దగ్గర నుండీ ముగింపు దాకా ఆ సినిమా కలిగించే అనుభూతి అద్భుతం. కరుణాకరన్ మ్యాజిక్కనుకున్నా పవన్ నటనా, ఆ హావభావ విన్యాసాలూ... మాటల్లో చెప్పనలవి అవుతుందా? పైగా అందులో ఒక్కొరితో ఒక్కోరకంగా నటిస్తాడాయే! చెల్లి పాత్ర ధారిణి వాసుకితో వచ్చే సన్నివేశాలు మనకూ ఇలాంటి అన్నయ్యో చెల్లెలో ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఇద్దరికిద్దరూ రెచ్చిపోయి మరీ జీవించేశారు.

కట్టుకోబోయే వాడికి బట్టతల అని పవన్ కోప్పడితే 'నీప్రేమ గుర్తొచ్చిందిరా' అని చెప్పే సన్నివేశం ఒకటి చాలు. కడుపు నిండిపోవటానికి. చిన్నప్పటి ఫొటోలు చూపించే సన్నివేశంలో, మొహాన పిండి కొట్టుకునే సన్నివేశంలో అల్లరి... అబ్బ! ఎంతందంగా ఉంటుందో. దర్శకుడి ప్రతిభ అని కొట్టి పడేసినా మన ఇంట్లోనే జరుగుతోందా అన్నంత ఫీలింగ్ తెప్పించటంలో నటీనటుల ప్రతిభ తేటతెల్లం.

ఇక నగేశ్ తో వచ్చే సన్నివేశాలైతే బాబోయ్! ఆ కామెడీ అయినా, సెంటిమెంటైనా చూసితీరాల్సిందే. ఎక్కడా ఓవర్‍ప్లే కాకుండా ఇద్దరూ నిజంగా పెద్ద నాన్నా, కొడుకులే అనిపిస్తుంది. ఇక తన ఫ్రెండ్స్ కాంబినేషన్లో వచ్చే సీన్లైతే చెప్పేదేముంది? ట్రెండ్ సెట్టింగ్!!!

కీర్తీ రెడ్డి కాంబినేషన్లో చేసిన ప్రతి సన్నివేశమూ ఒక ఆణిముత్యమే. ఓ అద్భుతాన్ని చూస్తున్నట్లు పవన్ ఇచ్చే expressions చాలా బాగుంటాయి. "ఏమి సోదరా", "గగనానికి ఉదయం ఒకటే..." పాటలు haunting. కీర్తి కోప్పడినప్పుడు చిన్నబుచ్చుకుంటం, మెచ్చుకున్నప్పుడు పొంగిపోవటం, తను తిక్క పన్లు చేసినపుడు వెర్రి మొహం వెయ్యటం... అంతెందుకు సినిమాలో మర్చిపోలేని సన్నివేశాలెన్నో, పవన్ నటనలో చెమక్కులన్ని. One of its kind movie...

ఇక 'తమ్ముడు' గురించి చెప్పాలా? మృష్టాన్న భోజనం లాంటి సినిమా.

పాటలూ, ఫైట్లూ, కామెడీ, సెంటిమెంటూ, ఫొటోగ్రఫీ, ఒకటనేముంది? అన్నీ సక్రమంగా తగుపాళ్ళలో ఉన్న అరుదైన సినిమాల్లో అదొకటి.

పరిగెడుతున్నప్పుడో, ఎక్సెరెసైజులు చేస్తున్నప్పుడో 'లుక్కెట్ మై ఫేస్ ఇన్ ద మీరర్..." అనుకోని ఆ తరపు టీనేజర్లెవరు? అమ్మాయిలను చూడగానే "వయారి భామా, నీ హంస నడకా..." అనిపించనిది ఎవరికి?

"రీటా మీటా బాటా" ఒక కామన్ వర్డ్ గా వాడే వాళ్ళూ ఉన్నారు. ఇక్కడా ఇతరుల కాంబినేషన్లలో సీన్లున్నాయి. గుర్తుండిపోయేలా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్ తో వచ్చే సన్నివేశాలు. ఆల్రెడీ తొలి ప్రేమ లో అన్నదమ్ములుగా వేశారిద్దరూ. ఈ సినిమాతోనైతే నిజంగానే వీళ్ళు అన్నదమ్ములన్నంతగా జీవించేశారు. పైగా అచ్యుత్ కే సినిమాలోని మొదటి రెండు స్టంట్స్ ఇచ్చేయటం ఈ రోజుల్లో సాధ్యమా? సినిమా అంతా చాలా న్యాచురల్‍గా ఉంటుంది.

ఫ్రెండ్స్ తో అల్లరి చెప్పుకునేదేముంది? ఇక మల్లిగాడిని ఆటపట్టిస్తూ పాడే పాటలూ, ఫేమస్ టెలిఫోన్ సీన్లో ఇద్దరి expressions, అదుర్స్. అంతే! శాకూంత్లాకియా ఇప్పటికీ మన నోళ్ళలో నానుతూనే ఉంటుంది. 

మేడిన్ ఆంధ్రా స్టూడెంటంటే అర్థం వివరిస్తా లో చేసిన డ్యాన్స్... అదన్నమాట సంగతి!

చివర్లో వచ్చే కిక్ బాక్సింగ్ సన్నివేశం ఒక రిఫెరెన్స్ అలాంటి వాటికి.

ప్రీతీ జింగ్యానీ లవ్ సీన్లు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. అదితి కాంబినేషన్లో చెప్పుకునే సెల్ఫ్ డబ్బా సీన్లింకో ఎత్తు. తండ్రి తిడుతున్నప్పుడూ, అసహ్యించుకుని దూరం పెట్టిన సన్నివేశాల్లోనూ చూపిన నటన బ్రహ్మాండం.

బద్రిలో హీరోయిజాన్నింకో లెవెల్ కు తీసుకుని వెళితే, ఖుషి అభిమానులకు ఖుషీనిచ్చింది. "పవన్ ఎనిమిదో సినిమా ఎనిమిదో వింతా?" అని పత్రికల చేత హెడ్డింగులు పెట్టించుకోవటం ఈతరంలో ఏ హీరోకూ సాధ్యంకాలేదు, కాదు, కాబోదు!!!

మరి 2001 తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని పవన్, కొమరమ్ పులి, గుడుంబా శంకర్ లాంటి డిజాస్టర్ల తరువాతా ఇంకా అంత క్రేజ్ ఉందంటే, పవన్ కాక ప్రస్తుతం ఎవరు నంబర్ వన్? అయినా నంబర్లతో పనిలేని వాడే పవన్... దటీజ్ పవన్ కళ్యాణ్!

హుషారు, thy name is Pawan Kalyan!

Now tell me!

అత్తారింటికి దారేది ఇంకొకరికి సాధ్యమా? ఆ హీరోయిజానికే అది ట్రిబ్యూట్. దానిముందు గబ్బర్ సింగ్! కరువు తీర్చిపారెయ్‌లా? 

దేఖో దేఖో గబ్బర్ సింగ్
ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే?
మెరిసే మెరిసే
మందు బాబులం మేము మందు బాబులం
గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా...!
ఇక మిగిలింది కెవ్వు కేకే!
బాక్సాఫీసు కలక్షన్ల మోతే!

అరెవో సాంబా! లెక్కెట్టుకోరా డబ్బులూ, మరి fansoo?

లెక్కలకందరు.

గబ్బర్ సింగ్ కు పదేళ్ళ ముందు సరైన హిట్ లేదు. నాలుగు డిజాస్టర్లు. మధ్యలో రాజకీయాల గ్రహణం.

కానీ,

వీడు ఆరడుగుల బుల్లెట్టూ, తెలుగులో నమ్బర్ వన్నని చెప్పక్కర్లేని తిరుగు లేని, నమ్బర్లక్కర్లేని హీరో!

అందుకే పవన్ అంటే అంత వెర్రి...

దట్స్ వై పవన్ వెర్రి పవన్ వెర్రి పవన్ వెర్రి డి!!! 

Sing along with me buddies...! 

That's why పవన్ వెర్రి పవన్ వెర్రి పవన్ వెర్రి డి!!! 

He represented the post-PV Narasimha Rao era modern small-town middle-class youth like no other hero since. Not overly aggressive. Nor is he passive. Just perfect! Simply perfect! Made in Andhra Hero for the Telugu youth!

That's why పవన్ వెర్రి పవన్ వెర్రి పవన్ వెర్రి డి!!! 

Latest Articles
Raja Raja Chora Review
19 Aug 21 @ 3:05 PM